శ్రీకాకుళానికి చెందిన వన్యప్రాణి నిపుణుడికి అరుదైన గౌరవం

శ్రీకాకుళం నగరానికి చెందిన వన్యప్రాణి నిపుణుడు మూర్తి కంటిమహంతికి నాగార్జునసాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్ రాష్ట్రస్థాయి స్టీరింగ్ కమిటీలో 'ఎక్స్పర్ట్ మెంబర్'గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. తూర్పు కనుమల్లో అంతరించిపోతున్న కింగ్ కోబ్రాలు, పాంగోలిన్లు, ఫిషింగ్ కాట్స్ వంటి వన్యప్రాణుల రక్షణకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవం లభించింది. ఈ హోదాతో తనపై బాధ్యత పెరిగిందని, వన్యప్రాణి సంరక్షణకు మరింత అంకితమవుతానని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, అటవీ శాఖ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్