విశిష్ట సేవలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక గవర్నర్ గోల్డ్‌మెడల్ సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం రాత్రి శ్రీకాకుళంలోని స్థానిక రెడ్ క్రాస్ భవనంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కరికి ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా కార్యక్రమాలకు విశ్వసనీయతే అసలైన విజయం అన్నారు. తనకు జరిగిన సన్మానానికి ఆయన సముచిత రీతిలో కృతజ్ఞతలు తెలిపారు. రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్రావు, జెసి ఫర్మాన్ అహమ్మద్ ఖాన్, వాలంటీర్లు, అధికారులు పాల్గొన్నారు.