ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ శుక్రవారం తన కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక మంది స్థానికులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యేకు వినిపించారు. చిన్నచిన్న సమస్యలకు వెంటనే పరిష్కార సూచనలు ఇస్తూ, మేజర్ సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు సూచించారు. ప్రజల సమస్యలపై స్పందనతో ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని టీడీపీ నాయకులు తెలిపారు.