శ్రీకాకుళం, నైరా వ్యవసాయ కళాశాలలో అల్లూరి సీతారామరాజు 129వ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. అసోసియేట్ డీన్ డా. టి. శ్రీలత, ప్రొఫెసర్లు అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం అల్లూరి చేసిన త్యాగాలు, ధైర్యసాహసాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని డా. శ్రీలత పేర్కొన్నారు. యువత దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావంతో సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు.