సమ్మె నేపథ్యంలో ఆదివారం పనిచేస్తున్న బ్యాంకులు

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఆదివారం సెలవు దినం అయిన అన్ని బ్యాంకులు పనిచేస్తున్నాయి. ఈ నెల 28, 29, 30 తేదీలలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా ఖాతాదారుల సేవలకు అంతరాయం కలగనుండటంతో వారి సౌకర్యార్థం సెప్టెంబరు 27 ఆదివారం జిల్లాలోని అన్ని బ్యాంకులు సాధారణ పనిదినం మాదిరిగానే పనిచేస్తున్నాయని లీడ్28, 29 డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీనివాసరావు ఆదివారం స్పష్టం చేశారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతులతో ఈ రోజు పనిచేయాలని బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయని తెలిపారు. జిల్లాలోని ప్రజలు, ఖాతాదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ అత్యవసర బ్యాంకింగ్ పనులను ఆదివారమే పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. బ్యాంకులు కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి. అయితే బ్యాంకు ఉద్యోగుల హాజరు అంతoతమాత్రoగా ఉంది.

సంబంధిత పోస్ట్

✕
✕