శ్రీకాకుళంలో గురువారం జరిగిన సీఐటీయూ జిల్లా విస్తృత సమావేశంలో, కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని కోరుతూ జులై 30, 31 తేదీలలో కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి. తేజేశ్వరరావు, తదితరులు పిలుపునిచ్చారు. వివిధ షెడ్యూల్ పరిశ్రమల కార్మికులు, అంగన్వాడీ, ఆశ, వి. ఓ. ఎ, మధ్యాహ్న భోజనం పథకం వర్కర్స్, కాంట్రాక్టు & అవుట్ సోర్సింగ్ కార్మికులు అతి తక్కువ వేతనాలతో తీవ్ర శ్రమ దోపిడీకి గురవుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం గత 18 ఏళ్లుగా కనీస వేతనాలు సవరించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.