సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం జిల్లా పర్యటన రద్దయింది. ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్‌లో పేర్కొన్న ప్రకారం వెళ్లాల్సిన ప్రాంతాలను అధికారులు పరిశీలించి భద్రత, ఇతర అంశాలను సమీక్షించారు. సాయంత్రానికి వాతావరణం అనుకూలించకపోవడం, వర్షాల కారణంగా హెలికాప్టర్‌లో ఆయన ప్రయాణానికి ఇబ్బంది తలెత్తే అవకాశం ఉండటంతో రద్దయింది. రాజపురంలో తలపెట్టిన కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కొనసాగించనున్నారు.