శ్రీకాకుళం కన్సల్టేటివ్ కమిటీ జిల్లా స్థాయి సమీక్షా సమావేశం బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగింది. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి సంబంధించిన వివిధ ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాల మంజూరు, లక్ష్యాల సాధనపై సంబంధిత శాఖల అధికారులు, బ్యాంకర్లతో కలెక్టర్ సమీక్షించారు.