నులిపురుగుల నివారణకు అధికారుల సమన్వయం: కలెక్టర్

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, పిల్లల ఆరోగ్యమే వారి విద్యాభ్యాసంతో పాటు శారీరక, మానసిక అభివృద్ధికి ఎంతో ముఖ్యమని, నులిపురుగుల నివారణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని ఎమ్ సీఈ, గీతాంజలి పాఠశాలల్లో సోమవారం నిర్వహించిన జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి, విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఈవీఎన్ నరేష్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో 10 నుంచి 19 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలు, కిశోరులందరికీ మాత్రలు అందిస్తున్నట్లు, పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్

✕
✕