శ్రీకాకుళం జీఆర్పీ పరిధిలోని చీపురుపల్లి-గరివిడి మార్గంలో రైలు పట్టాల వద్ద మంగళవారం గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న జీఆర్పీ పోలీసులు మరణించిన వ్యక్తి సుమారు 40 ఏళ్ల వయస్సు ఉంటుందని, రైలు ఢీకొనడంతో మృతి చెంది ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు శ్రీకాకుళం జీఆర్పీ పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని సూచించారు.