అంగన్వాడీ చిన్నారులకు పండ్లు, స్వీట్లు పంపిణీ

శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్, గార మండలంలోని శిలగాం, తాన్ సాహెబ్‌పేట, చిన్నపల్లిపేట, వొనరవిల్లి, బురవెల్లి గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను మంగళవారం  సందర్శించారు. పిల్లల పోషకాహారం, తల్లీబిడ్డల సంక్షేమం కోసం అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న సేవలను ఆమె అభినందించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మహిళా నాయకులు, అంగన్వాడీ సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕