రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గురువారం ఉదయమే పింఛన్లు పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆగష్టు 1, 2024 గురువారం ఉదయం 6 గంటలకు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. కొత్తపేటలో లబ్ధిదారులకు పింఛన్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అందజేశారు. మున్సిపల్ కమిషనర్ ఓబులేసు, ఆర్డీఓ సి. హెచ్ రంగయ్య, పింఛన్ల పంపిణీ సిబ్బంది పాల్గొన్నారు.