నిర్భయ్ ఫండ్ తో జిల్లాలో మహిళలకు రక్షణ, భద్రతా సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జిల్లాను ఎంపిక చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ, భద్రతా సౌకర్యాలు ఏర్పాటుకు ఒక్క శ్రీకాకుళం జిల్లాను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కలెక్టర్ తో కేంద్ర ప్రభుత్వ అధికారులు వర్చ్యువల్ గా శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలకు ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాల పై కేంద్ర ప్రభుత్వ అధికారులకు వివరించారు. జిల్లా కలెక్టర్ అందించిన డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ అద్భుతంగా ఉందని కేంద్ర ప్రభుత్వ అధికారులు కలెక్టర్ ను అభినందించారు.