తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్డు ధరలు గణనీయంగా పెరిగాయి. శ్రీకాకుళం జిల్లాలో రిటైల్ ధర రూ.10కి చేరడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్లో రూ.4 ఉన్న గుడ్డు ధర, మే నాటికి రూ.5, జూన్ చివరి నాటికి రూ.8కి చేరింది. వేసవిలో ఎండల వల్ల కోళ్లు చనిపోవడం, ఉత్పత్తి తగ్గడం, గల్ఫ్ దేశాలకు ఎగుమతులు పునః ప్రారంభం, కోళ్ల మేత, మందుల ధరలు పెరగడం వంటి కారణాలతో ధరలు పెరిగాయని వాణిజ్య వర్గాలు తెలిపాయి.