పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన సమాజ స్థాపన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా మసలుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు. గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతుల సందర్భంగా శ్రీకాకుళంలోని డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన 'స్వచ్ఛాంధ్ర అవార్డులు - 2026' జిల్లా స్థాయి ప్రదానోత్సవంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 'స్వచ్ఛత అనేది కేవలం మున్సిపాలిటీ లేదా పంచాయతీల బాధ్యత మాత్రమే కాదు, సమాజంలోని ప్రతి ఒక్కరిది' అని అన్నారు.