శ్రీకాకుళం నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు

శ్రీకాకుళం డే అండ్ నైట్ జంక్షన్ ప్రాంతంలో శనివారం ఆహార భద్రతా అధికారులు పలు హోటళ్లపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ లక్ష్మీనారాయణ నేతృత్వంలో జరిగిన ఈ తనిఖీల్లో అనేక హోటళ్ల వంటశాలలు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. నిబంధనలు పాటించని హోటళ్లపై కఠిన చర్యలు తప్పవని, నాణ్యత లేని ఆహార నమూనాలను విశ్లేషణకు పంపినట్లు అధికారులు తెలిపారు. ల్యాబ్ నివేదికల ఆధారంగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చట్టం ప్రకారం హోటల్ యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్

✕
✕