గాంధీ జయంతి: నైర వ్యవసాయ కళాశాలలో ఘనంగా వేడుకలు

శ్రీకాకుళం రూరల్‌ మండలంలోని నైర వ్యవసాయ కళాశాలలో శుక్రవారం 157వ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అసోసియేట్‌ డీన్‌ డా. డి. చిన్నం నాయుడు ఆధ్వర్యంలో గాంధీజీ చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన సత్యం, అహింసా మార్గాలు సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అనంతరం వ్యాసరచన, వక్తృత్వ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓఎస్‌ఏ డా. ఎస్. గోవిందరావు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. గాంధీజీ ఆశయాలు స్ఫూర్తిదాయకమని తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕