ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గురువారం గార మండలం గార గ్రామంలో ఎమ్మెల్యే గోండు శంకర్రావుతో కలిసి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథకాలు ఏ మేరకు అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. కూటమి పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు.