గార: వంశధార నదిలో అస్వస్థతకు గురై వృద్ధురాలు మృతి

గార మండలం సాలిహుండం జాతరకు వచ్చిన వృద్ధురాలు పాత్రుని వడ్డెమ్మ (62) శనివారం మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వేణుగోపాల స్వామి జాతరకు వచ్చి వంశధార నదిలో స్నానం చేస్తూ అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి పోయింది. వెంటనే 108 వైద్యులను సంప్రదించగా వచ్చి చూసే సరికి అప్పటికే ఆమె చనిపోయిందని తెలిపారు. ఈమె స్వగ్రామం సారవకోట మండలంగా తెలిసింది.

సంబంధిత పోస్ట్