గార మండలం వాడాడ పంచాయతీలోని అచ్చన్న పాలెంలో జూదమాడుతున్న తొమ్మిది మందిపై దాడి చేసి నగదు స్వాధీనం చేసుకున్నామని ఏఎస్ఐ ఎం చిరంజీవి తెలిపారు. శనివారం రాత్రి జూదం ఆడుతున్నట్లుగా గుర్తించి టాస్క్ ఫోర్స్ సిబ్బందితో దాడి చేశామని పేర్కొన్నారు. ఈ దాడిలో 9 మందిని అదుపులోకి తీసుకున్నామని స్పష్టం చేశారు. అలాగే వారి వద్ద నుండి 16 వేల 900 రూపాయలు నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని స్పష్టం చేశారు.