శ్రీకాకుళం జిల్లా రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. ఈ సందర్భంగా రానున్న పండుగలు దృష్ట్యా చర్లపల్లి-బ్రహ్మపూర్-చర్లపల్లి(రైలు నం. 07027/28) మధ్య ప్రత్యేక రైలు నడపనున్నట్లు వెల్లడించింది. ఈ రైలు అక్టోబర్ 2వ తేదీ నుంచి నవంబర్ 27వ తేదీ వరకు అందుబాటులో ఉండనున్నట్లు రైల్వే శాఖ సిపిఆర్ఓ శ్రీధర్ సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ రైలు జిల్లాలోని పలు ప్రధాన స్టేషన్లు అయినా శ్రీకాకుళం రోడ్డు, పలాస, ఇచ్చాపురం, నౌపాడ వంటి స్టేషన్లలో ఆగనుంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు.