వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో వాహనాల ముమ్మర తనిఖీ

శ్రీకాకుళం నగరంలో, గురువారం సాయంత్రం ప్రభుత్వ మహిళా కళాశాల రోడ్డులో వన్ టౌన్ ఎస్.ఐ. రామారావు నేతృత్వంలో పోలీసులు వాహనాలను విస్తృతంగా తనిఖీ చేశారు. అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా, పెండింగ్ చలాన్ల క్లియరెన్స్, డ్రంక్ అండ్ డ్రైవ్, రోడ్డు భద్రతా నియమావళిపై కౌన్సిలింగ్ వంటి బాధ్యతలను ఈ తనిఖీలలో నిర్వహిస్తున్నట్లు ఎస్.ఐ. తెలిపారు. జిల్లా ఎస్.పి. మహేశ్వర రెడ్డి సూచనల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్