శ్రీకాకుళంలోని స్థానిక శాంతినగర్ గాంధీ పార్క్ లో గాంధీ విగ్రహానికి గాంధీ జయంతి రోజున వినతి పత్రం సమర్పించడం ద్వారా జర్నలిస్టులు వినూత్న నిరసనకు దిగారు. జర్నలిస్టుల వృత్తి, వ్యక్తిగత భద్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీనియర్ జర్నలిస్టు నల్లి ధర్మారావు డిమాండ్ చేశారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం నగరంలోని శాంతినగర్ గాంధీ పార్కులో జర్నలిస్టులు గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. బీమా, హెల్త్ కార్డులు, పింఛన్ అమలు చేయాలని కోరారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు జగదీష్, కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు.