కావ్య పూర్ణిమకు ORDI రేర్ స్టార్ అవార్డ్

శ్రీకాకుళంకి చెందిన ప్రముఖ సంఘసేవకులు దివంగత బి.ఎస్. శాస్త్రి మనవరాలు బలజేపల్లి కావ్య పూర్ణిమకు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ORDI రేర్  స్టార్ అవార్డ్-2026 లభించింది. ఈ పురస్కారంతో పాటు NIDHI నగదు పురస్కారం కూడా ఆమె కైవసం చేసుకున్నారు.  దేశవ్యాప్తంగా వచ్చిన నామినేషన్లలో వ్యక్తిగత సాధనలు, ప్రతికూల పరిస్థితులను అధిగమించిన తీరు, సమాజంపై చూపిన ప్రభావం, నాయకత్వ లక్షణాలు, జన జాగృతికి చేసిన కృషిని పరిగణనలోకి తీసుకొని ORDI అవార్డుకు ఆమెను ఇటీవల ఎంపిక చేసారు. అరుదైన వ్యాధి కారణంగా దృష్టిని కోల్పోయినప్పటికీ, క్రుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో  తన జీవితాన్ని సమాజ హితం కోసం అనితర సాధ్యమైన రీతిలో తీర్చిదిద్దుకున్న కావ్య సమకాలీన సమాజంలో ఎందరికో మార్గదర్శిగా నిలిచారు.

సంబంధిత పోస్ట్