శ్రీకాకుళం రూరల్: అలికాం గ్రామంలో శనివారం నైరా వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా, నైరా కళాశాల సాయిల్ సైన్స్ విభాగం ప్రొఫెసర్ డా.పి.గురుమూర్తి, సమీకృత పోషక నిర్వహణ, వర్మీకంపోస్ట్, ప్రీ-మాన్‌సూన్ డ్రై సోయింగ్ (PMDS), భూసార పరీక్షలు, వాటి ఫలితాల ప్రాముఖ్యతను రైతులకు వివరించారు. భూసారాన్ని పరిరక్షించేందుకు సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ చరిత, విలేజ్ సెక్రటరీ కె.శ్రీనివాసరావు, రైతులు, నైరా వ్యవసాయ కళాశాల మొదటి సంవత్సరం పీజీకి చెందిన 17 మంది విద్యార్థులు పాల్గొన్నారు.