జాతీయ రహదారిపై లారీ బీభత్సం.. 70 గొర్రెలు మృతి

శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి లారీ బీభత్సం సృష్టించింది. లారీ హఠత్తుగా ఢీకొట్టడంతో సుమారు 70 గొర్రెలు మృతి చెందాయి. ఒక ఒక గొర్రెల కాపరి గాయపడ్డాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఏడుగురు గొర్రెల కాపరులు రోడ్డుపై ఓ పక్కన గొర్రెలను నడిపించుకుంటూ వెళుతుండగా అర్ధరాత్రి సమయంలో లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక గొర్రెల కాపరికి గాయాలు కాగా 70 గొర్రెలు మృతి చెందాయని యజమానులు తెలిపారు. బాధితుడిని పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఒకేసారి 70 గొర్రెలు మృతి చెందడంతో కాపరులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ దుర్ఘటనపై పోలీసులు దర్యాపు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕