సంతబొమ్మాళి మండలం ఆర్.మరువాడ గ్రామానికి చెందిన పాల ఈశ్వరరావు దుబాయ్‌లో మే 15న అదృశ్యమయ్యారు. తాజాగా ఆయన ఆచూకీ లభ్యమైంది. అక్కడి పోలీసులకు చిక్కిన ఈశ్వరరావును, మేఘవరం గ్రామానికి చెందిన బంధువులు గంట గోవిందరావు, పాల కేశవలకు అప్పగించారు. తన భర్త క్షేమంగా ఉన్నారని భార్య భారతి శుక్రవారం ఆనందం వ్యక్తం చేశారు.