శ్రీకాకుళం, ఏపీ హెచ్బి కాలనీ జిల్లా పరిషత్ ఎదురుగా ఉన్న శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక ధ్యాన మందిరంలో జూలై 24 నుంచి 30వ తేదీ వరకు మహాకుంభాభిషేక మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు శనివారం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆలయ కమిటీ చైర్మన్ గావిడి వాసు మాట్లాడుతూ, ఏడు రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాల్లో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు, హోమాలు, యాగాలు, మహాకుంభాభిషేకం, అన్నసమారాధన వంటి కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు పెంట శ్రీనివాస్ శర్మ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.