వినాయక నిమజ్జనాలు వాయిదా వేయండి - కలెక్టర్

శ్రీకాకుళం: కళింగపట్నం వద్ద తుఫాను తీరం దాటనుందని, ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలు, భక్తులు వినాయక నిమజ్జనాలను వాయిదా వేసుకోవాలని కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ బుధవారం రాత్రి ప్రకటించారు. తుఫాను సమయంలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, భారీ వర్షాలు కురుస్తాయని, కాబట్టి భద్రత దృష్ట్యా నిమజ్జనాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే తెలియజేస్తే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపుతామని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕