శ్రీకాకుళం జిల్లాలో వారం రోజుల పాటు వర్షాలు ?

What: శ్రీకాకుళం: బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతున్న కారణంగా జిల్లాలో వారం రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ శుక్రవారం వెల్లడించింది. అల్పపీడనం ప్రభావం వలన తీరం వెంట గంటకు 60 కి. మీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంపై వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే, తీరప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ మేరకు కళింగపట్నం నుండి మచిలీపట్నం వరకు పోర్ట్ లలో మూడో నెంబర్ హెచ్చరిక జారీ అయింది.

సంబంధిత పోస్ట్