శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవాల విజయానికి రవి సేవలు అభినందనీయం

శ్రీకాకుళంలోని విశాఖ బీ కాలనీలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వినాయక చవితి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన రవిని ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీ పెద్దలు, కాలనీ సభ్యులు ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా కాలనీ సభ్యులు మాట్లాడుతూ రవికి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, ఐశ్వర్యం ప్రసాదించి, ఎల్లప్పుడూ కాపాడాలని ప్రార్థించారు. ఉత్సవాల నిర్వహణలో ఆయన చేసిన సేవలను అభినందిస్తూ కాలనీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕