శ్రీకాకుళం: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను ఆదుకునేందుకు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో, నెక్స్టెరా వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో శనివారం శ్రీకాకుళం పట్టణంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎల్. విశ్వేశ్వరరావుతో కలిసి రెడ్‌క్రాస్ జిల్లా శాఖ చైర్మన్ పి. జగన్మోహనరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్మోహనరావు మాట్లాడుతూ, విద్యార్థులకు వృత్తిపరమైన నైపుణ్యాలతో పాటు సమాజం పట్ల సేవాగుణాన్ని అలవర్చడం ఆదర్శనీయమని అన్నారు. శిబిరంలో 25 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని నిర్వాహకులు తెలిపారు.