నేత్రదానం గొప్పతనాన్ని చాటిన రెడ్ క్రాస్ ర్యాలీ

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, కళ్యాణ్ మగటపల్లి నేత్ర సేకరణ కేంద్రం ఆధ్వర్యంలో 41వ జాతీయ నేత్రదానం పక్షోత్సవాల సందర్భంగా అవగాహన ర్యాలీ బుధవారం శ్రీకాకుళంలో జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేష్ కుమార్, మరణానంతరం కూడా ఇతరులకు చూపును ప్రసాదించే గొప్ప అవకాశం నేత్రదానం ద్వారానే సాధ్యమని, దీని ఆవశ్యకతను అందరూ గుర్తించాలని పిలుపునిచ్చారు. రెడ్ క్రాస్ చైర్మన్ పి. జగన్మోహన్ రావు ర్యాలీని ప్రారంభించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది, నేత్ర సేకరణ కేంద్రం ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్