నేడు (సోమవారం) ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో యధాతధంగా నిర్వహించ బడుతుందని, అయితే రెవిన్యూ క్లినిక్ ను మాత్రము రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాలలో రెవెన్యూ సిబ్బంది సహాయక చర్యలు, పంట నష్టము అంచనాలు కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నందున రెవెన్యూ క్లినిక్ ను రద్దు చేసినట్లు ఆయన తెలియజేశారు. అర్జీదారులు రెవెన్యూ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులతో సోమవారం రావద్దని ఆయన సూచించారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నేరుగా పై కార్యక్రమములో లేదా ఆన్లైన్ లో (మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్) వెబ్సైట్ లో అర్జీలు నమోదు చేసుకోవచ్చుని పేర్కొన్నారు. అర్జీ దారుల అర్జీల నమోదు, నమోదైన అర్జీల గురించి వాటి యొక్క స్థితి దానికి సంబంధించి సమాచారం గూర్చి తెలుసుకోవాలంటే 1100 కి నేరుగా కాల్ చేయవచ్చని వివరించారు.