గొల్లపేటలో రహదారి సమస్య పరిష్కారం

శ్రీకాకుళం జిల్లా పొన్నం పంచాయతీ పరిధిలోని గొల్లపేట జోగవారి వీధిలో రహదారి మధ్యలో ఉన్న కాలువ ప్లేట్ల వల్ల ఏర్పడిన రాకపోకల ఇబ్బందులను దుంగ ఆనందరావు గుర్తించారు. స్థానిక పెద్దలతో కలిసి ఆయన సమస్య పరిష్కారానికి గురువారం చర్యలు చేపట్టారు. కాలువ ప్లేట్లను తొలగించి, కాంక్రీట్ పనులు నిర్వహించి, ప్లేట్లను సక్రమంగా అమర్చడంతో పాటు రహదారిని రాకపోకలకు అనుకూలంగా మార్చే పనులు పూర్తి చేశారు. ఈ పనుల వల్ల స్థానిక ప్రజలు, వాహనదారులకు రాకపోకలు సులభతరం అయ్యాయి. ఈ కార్యక్రమంలో తూర్పు కాపు వర్కింగ్ ప్రెసిడెంట్ గుమ్మడి శాంతారావు, రామకృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕