నాగావళికి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ

శ్రీకాకుళంలో నాగావళి నదికి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి శుక్రవారం బూర్జ మండలం అల్లెన, లక్కుపురం గ్రామాల్లో పర్యటించారు. రోడ్లపైకి నీరు చేరడంతో ఇద్దరూ లైఫ్ జాకెట్లు ధరించి జీపులో ప్రయాణించి పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశామని, ప్రస్తుతం జిల్లాలో పరిస్థితి అదుపులోనే ఉందని కలెక్టర్ తెలిపారు. నాగావళి నదిలో 80 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండటంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశామని, ప్రజలు అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕