అంతర్జాతీయ బాలికా దినోత్సవం పై లఘు చిత్రాల పోటీలు

అంతర్జాతీయ బాలికా దినోత్సవం పై లఘు చిత్రాల పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఇ. ఎన్. వి. నరేష్ కుమార్ వెల్లడించారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని లఘు చిత్రాల పోటీలు"లింగ వివక్షతను ఆపండి ఆడపిల్లలను కాపాడండి" అనే నినాదంతో గర్భస్థ లింగ నిర్ధారణ నిషేధ చట్టం అమలుపై ప్రజల్లో సంపూర్ణ అవగాహన కల్పించేందుకు లఘు చిత్రాల పోటీలు నిర్వహిస్తున్నట్లు బుధవారం తెలిపారు. అక్టోబర్ 11, 2026న జరగనున్న అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పోటీలలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు పాల్గొనడానికి అర్హులని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు తమ కళాశాల ప్రిన్సిపాల్ను సంప్రదించి, ఈ నెల 25వ తేదీలోపు తమ ఎంట్రీలను నమోదు చేసుకోవాలని సూచించారు. తమ లఘు చిత్రాలను అక్టోబర్ 3వ తేదీలోపు సమర్పించాల్సిందిగా పేర్కొన్నారు

సంబంధిత పోస్ట్

✕
✕