78వ స్వాతంత్ర దినోత్సవ వేడుక పురస్కరించుకొని గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు గౌరవ వందనం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి స్వీకరించారు. ఎస్పీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బందికి స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు పంచి పెట్టారు. అదనపు ఎస్పీ డా జి ప్రేమ్ కాజల్, డిఎస్పీ ఎల్ శేషాద్రి, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.