శ్రీకాకుళం: 1, 80, 000 మందికి పోలియో చుక్కలు.. జిల్లా కలెక్టర్

శ్రీకాకుళం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో ఏర్పాటుచేసిన శిబిరాన్ని సందర్శించి, ఈ కార్యక్రమం గురించి వివరించారు. జిల్లాలో 1,80,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

సంబంధిత పోస్ట్