శ్రీకాకుళం: గ్రానైట్ లారీని ఢీకొన్న మరో లారీ.. ఒకరు మృతి

శ్రీకాకుళం మండలం నీలం జూట్ మిల్ సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. నరసన్నపేట నుండి శ్రీకాకుళం వైపు వెళుతున్న గ్రానైట్ లారీని వెనుక నుండి మరో లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గ్రానైట్ లారీ క్లీనర్ గ్రానైట్ రాయి మీద పడిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తిరిగి రావలసి ఉంది.

సంబంధిత పోస్ట్