శ్రీకాకుళం: ఉమా రుద్రుని త్రిశూల తీర్థ స్నానాలు

శ్రీకాకుళం గుడి వీధిలోని శ్రీ ఉమా రుద్ర కోటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి నాగావళి నదిలో త్రిశూల తీర్థ స్నానాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి శ్రీరామ్ మూర్తి శర్మ ఆధ్వర్యంలో సోమవారం ఈ కార్యక్రమం జరిగింది. శుద్ధి అనంతరం ఉత్సవమూర్తులకు ప్రత్యేక హోమ పూజలు చేపట్టారు. స్వామివారి కల్యాణ వార్షికోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్