సంక్షేమం పారిశుద్ధ్యం నిర్వహణలో శ్రీకాకుళం జిల్లా భేష్

శ్రీకాకుళం జిల్లా పారిశుధ్య నిర్వహణలో రాష్ట్రంలో 2వ స్థానం, సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో 3వ స్థానం, చిన్నారుల సంరక్షణలో 5వ స్థానం సాధించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కొనియాడారు. బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఖరీఫ్ సీజన్ కింద ఈ-పంట నమోదును వంద శాతం పూర్తి చేయాలని, అర్హులైన రైతులందరినీ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. పాలనలో పారదర్శకత కోసం ఇ-ఆఫీస్ విధానాన్ని వంద శాతం అమలు చేయాలని, భౌతిక ఫైళ్ల కదలికను నిలిపివేయాలని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో గడువు దాటిన పిటిషన్లను 0.5 శాతం లోపునకు తీసుకురావాలని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్