శ్రీకాకుళం డీఎంహెచ్ఓ బాల మురళీకృష్ణ, సీసీ వాన సురేశ్ కుమార్లను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 3న ఏసీబీ దాడుల్లో వీరు పట్టుబడ్డారు. వారిని 4న విశాఖపట్నం ఏసీబీ కోర్టులో హాజరుపరచగా ఈనెల 17 వరకు రిమాండ్ విధించారు. దీనిపై సమగ్ర నివేదిక ప్రభుత్వానికి అందించటంతో తగు చర్యలు తీసుకుంది. వీరిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది