శ్రీకాకుళం: సీసీ పుటేజ్‌లో కనిపించిన ఐదుగురు దొంగలు

నరసన్నపేట మండలంలో గురువారం అర్ధరాత్రి  ఉర్లాంలోని శ్రీ అయ్యప్ప జ్యూవెలరీ షాపులో చోరీ జరిగిన విషయం తెలిసిందే. యజమాని ఫిర్యాదుతో సీఐ జె. శ్రీనివాసరావు సీసీ పుటేజ్‌లను పరిశీలించారు. ఐదుగురు వ్యక్తులు ఇనుప గ్రిల్స్‌ను కట్టర్లతో తొలగించి లోపలికి వెళ్లినట్లు సీఐ తెలిపారు. అక్కడికి వచ్చిన క్యూస్ టీం నిందితుల వేలిముద్రాలు సేకరించి పాత నేరస్తులుగా గుర్తించారు. దీనిపై పలు కోణాల్లో దర్యాప్తు సాగుతుంది.

సంబంధిత పోస్ట్