శ్రీకాకుళం మండల విద్యాశాఖాధికారి జి కృష్ణారావు గురువారం రాత్రి మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యుల వివరాల మేరకు. విశాఖపట్టణంలోని ఓ ఆసపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. శుక్రవారం ఉదయం అతని అంత్యక్రియలు వారి స్వగ్రామంలో నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు. ఈయన మృతి పట్ల ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.