ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఓ చారిత్రాత్మక మలుపు: అచ్చెన్నాయుడు

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఓ చారిత్రాత్మక మలుపు అనీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దృఢ సంకల్పంతోనే ఉత్తరాంధ్రకు గోదావరి జలాల కల సాకారమైందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు  బుధవారం అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల జలస్వప్నం సాకారమైన వేళ గోదావరి జలాలు పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాకు చేరుకోవడం పట్ల మంత్రి అచ్చన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని చివరి ఆయకట్టు వరకు గోదావరి జలాలు రావాలన్నదే తమ ఆకాంక్ష అనీ ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్