అరసవిల్లిలో నేడు 2వ రోజు కూడా మూల విరాట్ ని తాకని కిరణాలు

శ్రీకాకుళం నగరం పరిధిలోని అరసవిల్లి ఆలయంలో సూర్యనారాయణ స్వామి మూలవిరాట్టును సూర్య కిరణాలు నేడూ కూడా తాకలేదు. ఆదిత్యునికి కిరణ స్పర్శ తాకే అపురూప దృశ్యాన్ని వీక్షించేందుకు భారీగా తరలివచ్చిన భక్తులకు రెండో రోజూ తీవ్ర నిరాశ ఎదురైంది. మబ్బులు కమ్ముకోవడంతో ప్రభాత భానుడి సూర్య కిరణాలు ఆలయంలోకి ప్రసరించలేదని అర్చకులు తెలిపారు. సూర్య కిరణాలు మూలవిరాట్ ని తాకే అద్భుత దృశ్యం చూడాలంటే మళ్లీ వచ్చే ఏడాది మార్చి నెల వరకు ఆగాల్సిందే.

సంబంధిత పోస్ట్

✕
✕