ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానంలో మంగళ, బుధవారాల్లో ఆదిత్యునికి సూర్యకిరణాలు తాకే అద్భుత దృశ్యం ఆవిష్కారం కానుందని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే అక్టోబర్ 1, 2 తేదిలో మూలవిరాట్ కు కిరణ స్పర్శ ఉంటుందన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.