శ్రీకాకుళం జిల్లాలో 22 ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ బుధవారం తో ముగియనుంది. ఈ మేరకు సంబంధిత గ్రామం/వార్డుకు చెందిన 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన, 25-45 ఏళ్లలోపు వయసున్న మహిళలు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ. 10,000 జీతం అందించనున్నారు. అర్హులైన వారు స్థానిక పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలలో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.