శ్రీకాకుళం జిల్లాలో విషాదకర ఘటన (UPDATE)

ఆమదాలవలస మండలం వెదుళ్లవలసలో మంగళవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. కూర్మాపు వరలక్ష్మి (30) తన ఇద్దరు కుమార్తెలు భవాని (3), చాందిని (4 నెలలు) గొంతు కోసి, అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ కలహాల కారణంగా క్షణికావేశంలో ఈ ఘోరం జరిగినట్లు స్థానికులు తెలిపారు. వరలక్ష్మిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఆమె భర్త కూలి పనుల నిమిత్తం నల్గొండలో ఉంటున్నాడు.

సంబంధిత పోస్ట్